టెట్రా ప్యాక్‌లలోని వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- టెట్రా ప్యాక్‌లు సాచెట్లలో మద్యం అమ్మకాలను నిషేధించాలని పిటిషన్
- పిటిషన్ దాఖలు చేసిన కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ
- పండ్ల రసాలను పోలి ఉండి తప్పుదారి పట్టేంచేలా ఉందన్న పిటిషనర్
టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి గుర్తించలేని ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రం స్పందనను కోరింది. ఇటువంటి ప్యాకేజింగ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించి, మైనర్ల మద్యపానాన్ని ప్రోత్సహించగలదని పిటిషన్‌దారు పేర్కొన్నారు. కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ అనే లాభాపేక్షలేని సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, పలు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది.
టెట్రా ప్యాక్, సాచెట్లలో వోడ్కా విక్రయాలు వినియోగదారులను తప్పుదారి పట్టిస్తాయని, మైనర్లను మద్యం వైపు ప్రోత్సహించే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ తరఫున లాయర్ విపిన్ నాయర్ వాదనలు వినిపిస్తూ, అలాంటి అనేక మద్యం ఉత్పత్తుల ప్యాకింగ్‌పై సరైన హెచ్చరికలు ఉండటం లేదని కోర్టుకు తెలిపారు.
అవి పండ్ల రసాలను పోలి ఉండేలా ప్యాక్ చేస్తున్న సందర్బాలు ఉన్నట్లు తెలిపారు. అలాంటి ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే విధమైన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను పరిశీలించింది. ప్యాకింగ్ తప్పుదోవ పట్టించేలా ఉందంటూ కేంద్రం, రాష్ట్రాల్లోని ఎక్సైజ్ విభాగాలకు నోటీసులు జారీ చేసింది.